రాశి ఫలితాలు…!

*(09-01-2023)
రాశి ఫలితాలు..!*

*మేషం*

దూర ప్రయాణాలు. బంధుమిత్రులతో విభేదిస్తారు. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అస్వస్థత. వృత్తులు, వ్యాపారాలలో నిరుత్సాహం. పారిశ్రామికవేత్తలు పర్యటనలు వాయిదా వేస్తారు.

*వృషభం*

ఆదాయం సంతృప్తినిస్తుంది. సన్నిహితులతో సఖ్యత. వాహన సౌఖ్యం. యత్నకార్యసిద్ధి. ప్రయాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. విందువినోదాలు.

*మిథునం*  

కొన్ని కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు.ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధువులతో మాటపడతారు. దైవారాధనలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిళ్లు కొంత తప్పవు.

*కర్కాటకం*

చేపట్టిన కార్యక్రమాలలో విజయం. బంధువులు దగ్గరకు చేరతారు. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వృత్తులు, వ్యాపారాలలో మరింత పురోగతి.

*సింహం*

కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దేవాలయ దర్శనాలు. వృత్తులు, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

*కన్య*  

రుణ యత్నాలు తప్పవు. ఆలోచనలు కలసిరావు. నిర్ణయాలలో మార్పులు. తీర్థ యాత్రలు చేస్తారు. ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రయాణాలు ఉంటాయి. వృత్తులు, వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి.

*తుల*

కార్యక్రమాల్లో మార్పులు. ఆకస్మిక ప్రయాణాలు. స్వల్ప అస్వస్థత..బంధువుల నుంచి ఒత్తిడులు. వృత్తులు, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు శ్రమాధిక్యం.

*వృశ్చికం*

యత్నకార్యసిద్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆస్తి విషయాల్లో చికాకులు తొలగుతాయి. రాబడి సంతృప్తినిస్తుంది. నూతన పరిచయాలు. వృత్తులు, వ్యాపారాలు మరింత అనుకూలం.

*ధనుస్సు*

కొత్త పరిచయాలు. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వాహన సౌఖ్యం. వృత్తులు, వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. విందువినోదాలు.

*మకరం*

కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు. కొన్ని కార్యాలు వాయిదా వేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు. స్వల్ప శారీరక రుగ్మతలు. వృత్తులు, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

*కుంభం*

కార్యక్రమాలలో స్వల్ప అవాంతరాలు. దూరప్రయాణాలు చేస్తారు. శ్రమ కొంత పెరుగుతుంది. అస్వస్థత, వైద్యసలహాలు. వృత్తులు, వ్యాపారాలలో సామాన్యమైన పరిస్థితి.

*మీనం*

అనుకున్న ఆదాయం లభిస్తుంది. యత్నకార్యసిద్ధి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. గృహ, వాహన యోగాలు. వృత్తులు, వ్యాపారాలలో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. దైవారాధనలో పాల్గొంటారు.