రాశి ఫలితాలు..

*(19-01-2023) రాశి ఫలితాలు*

*మేషం*

పితృ వర్గీయులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో ప్రతిష్టంభన కలుగుతాయి. రెండు రకములైన ఆలోచన వల్ల నష్టాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధువులతో అకారణ వివాదాలు తప్పవు. కొన్ని వ్యవహారాలు దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు.

*వృషభం*

ఇతరుల పై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు.

*మిధునం*

వ్యాపారాల్లో ఆశించిన విధంగా రాణిస్తాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

*కర్కాటకం*

ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో సన్నిహితులు సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది.

*సింహం*

చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

*కన్య*

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధుమిత్రులు మీ మాటతో విబేదిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. నూతన ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.

*తుల*

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని విషయాలలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు.

*వృశ్చికం*

వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నిరుద్యోగులకు ఒక వార్త సంతోషాన్నిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

*ధనస్సు*

బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు, కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

*మకరం*

దూరప్రయాణ సూచనలున్నవి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. నూతన ఋణప్రయత్నాలు కలసిరావు. చేపట్టిన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు.

*కుంభం*

వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తిచేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

*మీనం*

వృత్తి ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వ్యాపారాలు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బకాయిలు వసూలవుతాయి.
————————————–