ఈ రాశి వారికి సమస్యలు తీరతాయి…..

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: పౌర్ణమి రా.1.57 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: రేవతి ఉ.7.56 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: రా.3.04 నుండి 4.36 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.01 నుండి 7.32 వరకు, అమృతఘడియలు: రా.12.01 నుండి 1.34 వరకు, పాక్షిక చంద్ర గ్రహణం.; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.00, సూర్యాస్తమయం: 5.28..

మేషం…. కొత్త వ్యక్తుల పరిచయం. మిత్రులతో సఖ్యత. కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

వృషభం… పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రయాణాలు వాయిదా. మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం… పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి.

కర్కాటకం…. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

సింహం… సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. పనులలో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కన్య…. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. స్వల్ప అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

తుల…. శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి. సంఘంలో ఆదరణ. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

వృశ్చికం… పనుల్లో విజయం. శుభకార్యాల నిర్ధారణ. బంధువులతో సత్సంబంధాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు… వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మకరం…. సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కుంభం…. సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వస్తులాభాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

మీనం.. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. చర్చల్లో పురోగతి. పనులు అనుకున్న విధంగా పూర్తి. సేవాకార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు..