రష్యా , ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ద తో. ర‌ష్యా ప్ర‌భుత్వ ఛాన‌ల్ ఓ కొత్త సంచలనాత్మక స్టేట్మెంట్….

మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది అంటూ హెచ్చరికలు...

మా నౌక మునకతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది: రష్యా టీవీ ప్రకటన…!!!

ర‌ష్యాకు చెందిన మాస్క్‌వా యుద్ధ నౌక న‌ల్ల స‌ముద్రంలో మునిగిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఆ నౌక‌ను త‌మ నెప్ట్యూన్ మిస్సైల్‌తో పేల్చివేసిన‌ట్లు ఉక్రెయిన్ చెబుతోంది. మ‌రోవైపు ఆ నౌక‌లో జ‌రిగిన పేలుడు వ‌ల్ల అది మునిగిపోయిన‌ట్లు ర‌ష్యా మిలిట‌రీ వెల్ల‌డించింది. ఇక ఇప్పుడు ర‌ష్యా ప్ర‌భుత్వ ఛాన‌ల్ ఓ కొత్త స్టేట్మెంట్ ఇచ్చింది. మాస్క్‌వా మున‌గ‌డంతోనే మూడ‌వ ప్ర‌పంచ యుద్ధం మొద‌లైన‌ట్లు చెప్పింది. ర‌ష్యా వ‌న్ ఛాన‌ల్ ప్ర‌జెంట‌ర్ ఓల్గా స్క‌బ‌యేవా వార్త‌లు చ‌దువుతూ.. మాస్క్‌వా మున‌గ‌డంతో ప‌రిస్థితి అదుపు త‌ప్పింద‌ని, మూడ‌వ ప్ర‌పంచ యుద్ధ మొద‌లైన‌ట్లు ఆమె పేర్కొన్న‌ది. నాటో సైనిక ద‌ళంతో పోరాటం చేస్తున్నామ‌ని, ఇది మ‌నం గుర్తుంచుకోవాల‌ని ఆమె అన్నారు. మాస్క్‌వా మునిగిపోవ‌డం అంటే అది ర‌ష్యా నేల‌పై దాడి చేయ‌డ‌మే అని ఓ నిపుణుడు తెలిపాడు…..అగ్ని ప్రమాదం వల్లే నౌక ధ్వంసమైందని నొక్కిచెప్పినప్పటికీ మాస్క్వా మునిగిపోవడాన్ని రష్యా భూభాగంపై దాడితో పోల్చారు. ఈ సందర్భంగా షోలో పాల్గొన్న వ్యక్తి.. ఉక్రెయిన్‌పై దాడిని ప్రభుత్వం ‘ప్రత్యేక సైనిక చర్య’ అంటోంది కదా అని గుర్తు చేశారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…