రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఒకపక్క.బీజేపీ సంబరాలు మరోపక్క….
పార్లమెంట్లో భారత రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది...
ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో భారత రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం రానుంది.
ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యశ్వంత్ సిన్హా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ముర్ము విజయం సాధించడం లాంఛనమేనని రాజకీయ పండితులు తేల్చిచెబుతున్నారు….
భారత రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గతంలో ఎన్నడు లేనివిధంగా ఈసారి పోటీ నెలకొంది. ఎన్డీఏ తరపున ద్రౌపది ముర్ము, విపక్షాల తరపున యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. ఇవాళ్టితో నూతన రాష్ట్రపతి ఎవరన్న దానిపై క్లారిటీ రానుంది. ఈనెల 25న నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయనున్నారు…పార్లమెంట్ హాల్లో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీ సంబరాలు మొదలైయ్యాయి. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నిక లాంఛనమని బీజేపీ నేతలు అంటున్నారు. ఒడిశాలో సంప్రదాయ పద్దతిలో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు…