రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు ఘన స్వాగతం పలికిన సిఎం కేసీఆర్..

*హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై.. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. హకీంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి మరీ ద్రౌపది ముర్మును స్వాగతించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి అభివాదం చేశారు..

సీఎం వెంట మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎంపీ శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి నవీన్, శంభీపూర్ రాజు, మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మేడ్చల్ కలెక్టర్ తదితరులు ఉన్నారు…