ఉచిత రేషన్‌ పంపిణీ పొడిగించే ప్రతిపాదన లేదు. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ కార్యదర్శి వెల్లడి..;

*ఉచిత రేషన్‌ పంపిణీ పొడిగించే ప్రతిపాదన లేదు.

కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ కార్యదర్శి వెల్లడి

R9TELUGUNEWS.COM.. కరోనాతో తలెత్తిన సంక్షోభం దృష్ట్యా ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన (PMGKAY) పథకం కింద కేంద్రం దేశ ప్రజలకు ఉచితంగా రేషన్‌ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌ నుంచి మొదలైన ఈ ఉచిత పంపిణీ పథకం ఈ ఏడాది నవంబర్‌ వరకు కొనసాగనుంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటున్న తరుణంలో నవంబర్‌ 30 తర్వాత ఉచిత రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని పొడిగించే ప్రతిపాదన ఇంతవరకు లేదని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. శుక్రవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, బహిరంగ మార్కెట్లో ఆహార ధాన్యాల వినియోగం, విక్రయాలు ఈ ఏడాది బాగానే ఉన్న నేపథ్యంలో పీఎంజీకేఏవైని పొడిగించే ప్రతిపాదన లేదని చెప్పారు..