సైనిక లాంఛనాలతో రావత్ దంపతుల అంత్యక్రియలు.. భూమి పుత్రుడు రావ‌త్ అమ‌ర్ ర‌హే అంటూ నినాదాలు హోరెత్తాయి..

కుమార్తెలు కృతిక, తరుణి ఇద్దరు కలిసి చితికి నిప్పుపెట్టి అంతిమ సంస్కారాలు చేశారు…
R9TELUGUNEWS.COM….
భ‌రత భూమి పుత్రుడు రావ‌త్ అమ‌ర్ ర‌హే అంటూ నినాదాలు హోరెత్తాయి. బిపిన్ రావ‌త్ అమ‌ర్ ర‌హే.. సూర్యచంద్రులు ఉన్నంత కాలం.. బిపిన్ పేరు నిలిచిపోతదంటూ దేశ వీరుడికి జ‌నం వంద‌నాలు ప‌లికారు. సైనిక లాంఛనాలతో రావత్ దంపతుల అంత్యక్రియలు నిర్వహించారు… వారి అంత్యక్రియల ఏర్పాట్లను గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్‌ పూర్తి చేసింది. ఇదే రెజిమెంట్‌లో తొలుత చేరిన ఆర్మీలో చేరిన బిపిన్ ఆ తర్వాత దీనిని కమాండ్ స్థాయికి ఎదిగారు. అంత్యక్రియల్లో ఆయనకు 17 గన్‌ సెల్యూట్‌తో సైన్యం గౌరవ వందనం చేశారు..దేశ‌భ‌క్తి.. దేశ‌సేవ‌.. ఆయ‌న ఆలోచ‌న‌. సైన్యం ఆధునీక‌ర‌ణ ఆయ‌న ఆశ‌యం. క‌ర్త‌వ నిర్వ‌హ‌ణ‌లోనే ఆయ‌న చివ‌ర‌కు క‌న్నుమూసిన‌ సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్‌కు ఆశ్రు నాయ‌నాల మ‌ధ్య ఇవాళ అంతిమ వీడ్కోలు ప‌లికారు. భార‌త ఆర్మీని ప్రొఫెష‌న్ ఆర్మీగా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నించిన రావ‌త్‌కు కన్నీటితో వీడ్కోలు పలికారు. ర‌ణ‌నీతిలో త‌న అన‌న్య‌సామాన్య కౌశ‌లాన్ని ప్ర‌ద‌ర్శించిన బిపిన్ ఎప్ప‌టికీ గుర్తుండిపోతారు. కేవ‌లం సైన్యాధికారి రూపంలో మాత్ర‌మే కాదు.. వ్య‌క్తి రూపంలో ఆయ‌న అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నారు. దేశ‌భ‌క్తి, ప‌రాక్ర‌మం, వీర‌త్వం, సాహ‌స గుణాల‌తో అంద‌ర్నీ మెప్పించారు. అజేయ యోధుడిగా అమ‌రుడ‌య్యారు. దేశానికి ప్రేర‌కుడిగా నిలిచిన జ‌న‌ర‌ల్ రావ‌త్‌కు ఇవాళ ఢిల్లీలోని బార‌ర్ స్క్వేర్‌లో ఘ‌నంగా సైనిక రీతిలో అంతిమ సంస్కారాలు నిర్వ‌హించారు..