గుంటూరు.. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా 2024 ఎన్నికలకు దూరంగా ఉంటాను.
అవకాశం ఉన్నమేరకు నా కుమారుడికి సీటు కొరతాను…
*బండ్లమూడి గార్డెన్స్ లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న రాయపాటి.
*మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు రాయపాటి సాంబశివరావు వాఖ్యలు…
తెలుగుదేశం పార్టీలో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన వారసుడుకు సీటు అడుగుతున్నానని, చంద్రబాబు ఏ సీటు ఇస్తే అక్కడ తన కుమారుడు పోటీ చేస్తాడని రాయపాటి చెప్పుకొచ్చారు. అయితే తన వారసుడు వరకు చెబితే బాగానే ఉండేది గాని..రాయపాటి తాడికొండ సీటుపై కూడా కామెంట్ చేశారు. తాడికొండ టీడీపీ సీటు తోకల రాజవర్దన్ రావుకేనని, తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తారని చెప్పుకొచ్చారు..