లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో ‘RC15, షూటింగ్‌ పున:ప్రారంభం..

లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో ‘RC15’ చేస్తున్నాడు. మాములుగానే శంకర్‌ సినిమాలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడేకంగా చరణ్‌తోనే సినిమా చేయనుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలక్నొన్నాయి. అయితే శంకర్‌ ప్రస్తుతం ‘RC15’తో పాటు ‘భారతీయుడు-2’ చిత్రాన్ని కూడా ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాడు. కాగా ఇటీవలే ‘భారతీయుడు-2’ షూటింగ్‌ పునః ప్రారంభమైన విషయం తెలిసిందే.ఇక దాంతో చరణ్‌ సినిమాకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు. తాజాగా భారతీయుడు-2 షెడ్యూల్‌ పూర్తయింది. ఈ క్రమంలో శంకర్‌ మళ్లీ RC15కు సిద్ధమయ్యాడు. టాలీవుడ్‌ వర్గాల సమచారం ప్రకారం రాజమండ్రిలో సోమవారం నుండి ఓ చిన్న షెడ్యూల్‌ను స్టార్ట్‌ చేయనున్నాడట. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌పై 6రోజులు, మిగిలిన కాస్ట్‌పై 3,4 రోజులు షూట్‌ చేయనున్నాడట. అంతేకాకుండా ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్ తండ్రి పాత్రకు సంబంధించిన షూటింగ్ జరుగనుందట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అంతే కాకుండా ఈ చిత్రం దిల్‌రాజు నిర్మాణంలో 50వ సినిమాగా తెర‌కెక్కుతుంది. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సునీల్, న‌వీన్ చంద్ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.