ఆర్సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన బాయ్‌ ఫ్రెండ్‌ స్మృతి పలాష్‌ ముచ్చల్‌ సందడి..!

2024 ఛాంపియన్స్‌గా ఆర్సీబీ నిలిచిన సంగతి తెలిసిందే. అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది..ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ ఖాతాలో తొలి టైటిల్ చేరింది. ఐపీఎల్‌లో గత 16 ఏళ్లగా ఆర్సీబీ పురుషుల జట్టు నిరాశపరుస్తుండగా.. మహిళల జట్టు మాత్రం కేవలం రెండో సీజన్‍‍లోనే టైటిల్ సాధించి సత్తాచాటింది.

ఇక 16 ఏళ్ల తర్వాత ఆర్సీబీకి డబ్ల్యూపీఎల్ రూపంలో తొలి టైటిల్ రావడంతో బెంగళూరు ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలిపోయారు. సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి వంటి దిగ్గజ క్రికెటర్లు ఆర్సీబీ మహిళల జట్టును అభినందించారు.

బాయ్‌ ఫ్రెండ్‌తో స్మృతి..
ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన బాయ్‌ ఫ్రెండ్‌ స్మృతి పలాష్‌ ముచ్చల్‌ సందడి చేశాడు. మ్యాచ్‌ జరుగుతుండగా ఆర్సీబీకి సపోర్ట్‌ చేస్తూ పలాష్‌ కన్పించాడు. అదే విధంగా విజయనంతరం స్మృతి పలాష్‌ ముచ్చల్‌తో కలిసి ట్రోఫీతో ఫోటలోకు ఫోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.