తాము రాజీనామా చేసేందుకు సిద్ధము..సోనియా గాంధీ…

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. మా వ్యూహం లోపించడం వల్లే నాలుగు రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాల దుష్పరిపాలనను సమర్థవంతంగా బయటపెట్టలేకపోయాం. పంజాబ్ లో నాయకత్వ మార్పు తర్వాత తక్కువ సమయంలో ప్రభుత్వ వ్యతిరేకతను అదుపు చేయలేకపోయాం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, నాయకత్వ మార్పు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ సమావేశమైన సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సోనియా గాంధీ… ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ తాము రాజీనామాకు సిద్ధమన్న ఆమె ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా తిరస్కరించింది.. ఇక, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సోనియా.. పార్టీ కోసం గాంధీ కుటుంబం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం అని ప్రకటించారు.. వ్యక్తుల కన్నా పార్టీయే ముఖ్యం అని స్పష్టం చేసిన ఆమె.. గాంధీ కుటుంబం వల్లే పార్టీ బలహీన పడిందని భావిస్తున్నారు.. కొందరు నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారన్నారు. సీడబ్ల్యూసీ సమావేశం కోరితే.. తాము రాజీనామా చేసేందుకు సిద్ధమని తెలిపారు సోనియా గాంధీ.