పెరుగుతున్న కేసులు… తమకూ అంటిస్తుందేమోనని భయపడుతున్న ప్రపంచ దేశాలు…
చైనాలో మరో కొత్త రకం వైరస్ హడలెత్తిస్తోంది. దానిని లాంగ్యా హెనిపా వైరస్ గా వైద్యులు గుర్తించారు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది..తూర్పు చైనాలోని హెనాన్, షాన్డాంగ్ ప్రావిన్సుల్లో ఇప్పటి వరకూ 35 మందికి ఈ వైరస్ సోకినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది…
జర్వంతో బాధపడుతున్న రోగుల గొంతు నుంచి సేకరించిన నమూనాల్లో లాంగ్యా వైరస్ ను వైద్యులు గుర్తించారు. ఈ వైరస్ తీవ్రమైన ఇన్ఫెక్షన్ మనుషుల్లో మూడో వంతు మంది ప్రాణాలను తీయగలదని వెల్లడించారు.
అయితే ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో ఎలాంటి మరణం సంభవించలేదు. అంతేగాక ఈ వైరస్ బారిన పడిన వారిలో కేవలం స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. పేషెంట్లు ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. లాంగ్యా వైరస్ కు ఇప్పటి వరకూ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దాని లక్షణాలు, సమస్యల ఆధారంగా చికిత్స అందిస్తున్నారు…
యానిమల్స్ నుంచి వ్యాపించే హెనిపా వైరస్ ఇటీవల షాంగ్ డాంగ్, హెనాన్ ప్రావిన్స్ ల్లో కొందరిలో కనిపిస్తోంది…
జ్వరంతో బాధపడుతున్న పేషంట్ లో గ్లోబల్ టైమ్స్. ఈ వైరస్‌కు లాంగ్యా హెనిపా వైరస్‌గా పేరు పెట్టారు. బాధితుల్లో జ్వరం, దగ్గు, నీరసం, కండరాల నొప్పులు, వికారంగా ఉండటం, అనోరెక్సియా వంటి లక్షణాలు కనిపించాయి…