రెడ్డి సింహ గర్జన లో మంత్రి మల్లారెడ్డి కి చుక్కలు చూపించిన ఆ సంఘ నాయకులు..!!

కేసీఆర్ కి జై కొట్టడంతో... పదేపదే కేసీఆర్ గురించి మాట్లాడడం తో ఆగ్రహించిన రెడ్డి సంఘ నాయకులు..

రెడ్ల సింహ గర్జన”లో తీవ్ర ఉద్రిక్తత..

హైదరాబాద్

రెడ్ల సింహ గర్జన పేరుతో రెడ్డి కులస్తులు అందరూ కలిసి భారీ ఎత్తున ఓ పెద్ద సభా నిర్వహించడం జరిగింది.. ఈ సమావేశానికి చాలా మంది భక్తులు కూడా హాజరయ్యారు అంతేకాకుండా మంత్రి మల్లారెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు గురించే మాట్లాడాలి… రెడ్ల అభ్యుదయ కి ఏం చేయాలి భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే కార్యాచరణ మాట్లాడని చెప్పిన కానీ మంత్రి మల్లారెడ్డి టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కెసిఆర్ ని పొగుడుతూ కెసిఆర్ నేతృత్వంలో అభివృద్ధి చెందుతుంది అంటూ , KCR ను పొగుడుతుండగా మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర ఆగ్రహం.. మళ్లీ TRS ప్రభుత్వం వస్తుందని చెప్పడంతో మండి పడ్డ రెడ్డి సంఘం నాయకులు…పదే పదే TRS, KCR పేరెత్తడంతో కుర్చీలు పైకి లేపి వ్యతిరేక నినాదాలు చేశారు… అంతేకాకుండా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా చెప్పులు, రాళ్ళు విసిరేసి నిరసన తెలిపారు.. అయినా ఆపక పోవడంతో రెడ్డి సంఘం నాయకులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కిందికి దిగి రావాలి అని చెప్పడంతో మధ్యలోనే ప్రసంగం ఆపేసి వస్తున్న క్రమంలో ఒక్కసారిగా రెడ్డి సంఘం నాయకులు అందరూ మంత్రి మల్లారెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనవైపు వెళ్తుండగా పారిపోయిన మంత్రి మల్లారెడ్డి… మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ ను అడ్డుకుని కారుపై కుర్చీలతో, రాళ్లతో దాడి.. చేయగా అక్కడి నుంచి మంత్రి మల్లారెడ్డి ని పోలీసులు బందోబస్తుతో రెడ్డి సింహగర్జనకు హాజరైన నాయకులను చదర కొడుతూ సభాస్థలి నుంచి తీసుకు వెళ్లడం జరిగింది…