రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. నాతో పెట్టుకోకు…

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘హాత్ సే హాత్ జోడో’’ పాదయాత్రలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేగా కౌంటర్ అటాక్‌కు దిగారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… ‘‘రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. రేగా కాంతారావుతో పెట్టుకోకు’’ అంటూ హెచ్చరించారు. పినపాకలో కాంగ్రెస్ పార్టీని బతికించినట్లు తెలిపారు. ఇక్కడ బలంగా ఉందంటే తానే కారణమని చెప్పుకొచ్చారు. డీసీసీ అధ్యక్షునిగా ఎక్కువ కాలం ఉన్నది తానొక్కడినే అని ఆయన తెలిపారు..గిరిజనుడిని అనే అక్కసుతో నన్ను తొలగించిన వీళ్లా… నా గురించి మాట్లాడేది. తెలంగాణా అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించేందుకు… నేను రాజ్యాంగ బద్దంగా విలీనమయ్యాను. ఓటుకు నోటు కేసులో ఉన్న వీళ్లా నాగురించి మాట్లాడేది. నామీద చార్జ్‌షీట్.. నీకు దమ్ముంటే ఎవరైనా రండి.. 300 ఎకరాలు నేను ఆక్రమించినట్టు రుజువు చేయండి.. ముక్కు నేలకు రాస్తా’’ అంటూ సవాల్ విసిరారు. రేవంత్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని… అన్ని స్టేషన్లలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నాపై వేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే అసలు పోటీ నుంచే తప్పుకుంటానని రేగా కాంతారావు స్పష్టం చేశారు..