రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్..

రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్…

అధికార పార్టీ నుండి నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు…. ఇప్పటీకే కీలక నేతలు కాంగ్రెస్ లో చేరగా..తాజాగా ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్..రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఖానాపూర్ బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖ నాయక్..ఈసారి కూడా ఖానాపూర్ టికెట్ ఆశించినప్పటికీ..బిఆర్ఎస్ అధిష్టానం రేఖ నాయక్ కు బదులు భూక్యా జాన్సన్ నాయక్ కు టికెట్ ఇవ్వడం తో అధిష్టానం ఫై అసంతృప్తి తో ఆమె బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. నవంబర్ 30 న తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీలలో వలసల పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా వారికీ అనుకూలమైన పార్టీలలో చేరుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టింది. గత రెండు రోజులుగా ఈ యాత్ర కొనసాగుతుంది.