గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌కు సంబంధించిన వీడియోను ఒక‌టి చైనా రిలీజ్ చేసింది..

Enemy Slayer
https://twitter.com/EnemySlayer24_7/status/1362747774790467585?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1362747774790467585%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fnational%2Fchina-release-galwan-clashes-video-doubts-expressed-about-it-137542
అత్యంత ఎత్తైన‌ కొండ‌లు.. వాటి మ‌ధ్య ఉన్న న‌దీ లోయ‌లో.. చైనా, భార‌త సైనిక బ‌ల‌గాలు హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌కు దిగాయి. గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌కు సంబంధించిన వీడియోను ఒక‌టి చైనా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రెండు దేశాల‌కు చెందిన ద‌ళాలు.. స్టీల్ రాడ్ల‌తో గ్యాంగ్‌వార్‌కు దిగాయి. గాల్వ‌న్ న‌దీ ప‌రివాహాక ప్రాంతంలో ఇరు దేశాల సైనికులు ముష్టిఘాతానికి దిగారు. గాల్వ‌న్ ఘ‌ట‌న‌లో త‌మ సైనికులు చ‌నిపోయిన‌ట్లు అంగీక‌రించిన చైనా.. శుక్ర‌వారం ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో చైనా క‌మండ‌ర్ ఒక‌రు భార‌త ద‌ళానికి వార్నింగ్ ఇస్తూ క‌నిపించారు. ఇక ఆ త‌ర్వాత రెండు దేశాల‌కు చెందిన ద‌ళాలు భారీ సంఖ్య‌లో ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఎదురెదురుగా నిలుచున్న ఆ ద‌ళాలు.. ఘ‌ర్ష‌ణ‌కు దిగిన‌ట్లు తెలుస్తోంది. రాత్రి పూట కూడా ఆ ద‌ళాలు నువ్వానేనా అన్న‌ట్లు ఆ లోయ‌లో స‌మ‌రానికి సిద్ద‌మైయ్యాయి. ఆ వీడియోలోనే త‌మ ద‌ళాధినేత తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు కూడా చైనా చూపించింది. ఈ వీడియోను అత్యంత చాక‌చ‌క్యంగా ఎడిటింగ్ చేసిన‌ట్లు నిపుణులు చెబుతున్నారు. కేవ‌లం భార‌త్ వైపు మాత్ర‌మే త‌ప్పు ఉంద‌ని చిత్రీక‌రించేదిగా వీడియోను ఎడిట్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. చైనా ద‌ళాల‌ను శాంతి కాముకుల్నిగా చూపిస్తూ వీడియోను రిలీజ్ చేశారు. చైనా రిలీజ్ చేసిన వీడియోను ఖండించాలంటూ కొన్ని వాద‌న‌లు వినిపిస్తున్నాయి.