ఎస్.ఐ కాలర్ పట్టుకున్న రేణుక చౌదరి…

రాహుల్ గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చిన రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులకు, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరికి మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలో రేణుకను మహిళా పోలీసులు చుట్టుముట్టారు. మహిళా పోలీసులతో రేణుక వాగ్వాదానికి దిగి.. పోలీస్ స్టేషన్‌కు వచ్చి కొడతానని ఎస్.ఐకి రేణుక వార్నింగ్ ఇచ్చింది. ఎస్.ఐ కాలర్ పట్టుకుని రేణుక ప్రశ్నించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రేణుకా చౌదరి హెచ్చరించారు…కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆమెను అడ్డుకున్న ఎస్సై కాలర్ పట్టుకుని.. తనను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. అక్కడికి వచ్చిన మహిళా పోలీసులతోనూ రేణుక వాగ్వాదానికి దిగడంతో ఆమెను అరెస్టు చేశారు.