జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…

దేశ రాజధాని ఢిల్లీలో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జాతీయ గీతం ఆలపించిన అనంతరం 21 గన్ సెల్యూట్ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా హాజరయ్యారు. రాజ్ పథ్ పేరును కర్త్యవ్యపథ్ గా మార్చిన అనంతరం మొదటిసారి త్రివిధ దళాలు కవాతును నిర్వహించాయి. త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు రాష్ట్రపతి. ఈ వేడుకలలో ఉపరాష్ట్ర పతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, నాయకులూ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాలు, 17 రాష్ట్రాలకు చెందిన శకటాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి.