జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల..

జేఈఈ మెయిన్‌ ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరిగిన ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. అభ్యర్థులు ఫలితాలను jeemain.nta.nic.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. .. ఫలితాల విడుదలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సర్వం సిద్ధం చేసిందని సమాచారం..పరీక్షకు హాజరైన అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవాలని ఇప్పటికే ప్రకటించారు. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరిగిన జేఈఈ మెయిన్‌కు 6,61,776 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 95 శాతం మంది హాజరయ్యారు. ఈ పరీక్ష ఫైనల్‌ కీని ఈ నెల 7న ఎన్టీఏ విడుదల చేసింది. .అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.nic.in/ లో ఫలితాలు, ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.