సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు..

*తెలంగాణ ప్రజలకు కచరానే ఎడమకాలి చెప్పుతో సమానం*

: సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిల్లాలో పర్యటించిన ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పాలించమని అప్పగించిన సీఎం పదవిని చెప్పుతో పోల్చి.. కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను అవమానించారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు కేసీఆరే ఎడమ కాలు చెప్పుతో సమానమని ఎద్దేవా చేశారు. సీఎం పదవి కోసం కేటీఆర్ ఒత్తిడిని, ఇంటి పోరును భరించలేక ప్రజలను కేసీఆర్‌ అవమానించారన్నారు. సీఎం పదవిని చెప్పుతో పోల్చిన కేసీఆర్‌ ఆపదవికి అనర్హుడన్నారు. కేసీఆర్‌ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం పదవిని చెప్పుతో పోల్చడం కేసీఆర్‌ దొరహంకారానికి నిదర్శనమన్నారు.