ధర్నాలు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించిన ఎంపీ రేవంత్ రెడ్డి…

R9TELUGUNEWS.COM.. : రాష్ట్రవ్యాప్తంగా నేడు నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ ధర్నాలను ఉపసంహరించుకున్నట్టు ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమ ఫిర్యాదులపై అసోం సీఎం పై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్లు నమోదు చేయకపోవడంతో మరోసారి ఫిర్యాదు చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. కానీ అందులో సెక్షన్లు సరైనవి కాదన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసు… ఆపరేషన్ సక్సెస్‌ పేషెంట్‌ డెడ్‌ అన్నట్లుగా ఉందన్నారు. అయితే అసోం సీఎం బిశ్వశర్మపై మరోసారి రేవంత్‌ ఫిర్యాదు చేసి సంబంధింత సెక్షన్ల ప్రకారమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరారు. దాంతో అసోం సీఎంపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు రేవంత్‌కు తెలిపారు. అనంతరం ధర్నాలను ఉపసంహరించుకుంటున్నట్టు ఎంపీ రేవంత్ చెప్పారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను విడుదల చేయాలని కోరారు.