రైతులు వెంటనే వెళ్లి రూ.2 లక్షల లోన్ తెచ్చుకోండి: రేవంత్..

హైదరాబాద్ గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రైతులు వెంటనే వెళ్లి బ్యాంకుల్లో రూ.2 లక్షల లోన్ తెచ్చుకోండి. డిసెంబర్ 9న నేను రాగానే దాన్ని మాఫీ చేస్తా. రుణమాఫీ చేసినందుకు ఓట్లు తనకే పడతాయని కేసీఆర్ అనుకుంటున్నారు. ఇప్పటివరకు రుణమాఫీ అయినవాళ్లు వెంటనే వెళ్లి రూ.2 లక్షల రుణం తెచ్చుకోండి. నేను మాఫీ చేస్తా’ అని అన్నారు.