తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఆదరించాలి.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

R9TELUGUNEWS.COM: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఆదరించాలని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి..
. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన కేసీఆర్‌కు లేదని విమర్శించారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ ముడిమ్యాల నుంచి చేవెళ్ల వరకు ఆయన పాదయాత్ర చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టాలనేదే కేసీఆర్‌ నిరంతర ఆలోచన అని ఆరోపించారు. అగ్గి పుట్టిస్తానని దిల్లీ వెళ్లి కేసీఆర్‌ ఏం చేశారని నిలదీశారు. ‘మీ ఓట్లతో గెలిచిన తెరాస ప్రభుత్వం మీ వడ్లు కొనటం లేదు. భాజపా పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. కేంద్రం, రాష్ట్రం కలిసి పెట్రోల్‌, డీజిల్‌ ధరను పెంచాయి’ అని రేవంత్ అన్నారు.