మంత్రి కేటీఆర్ కు సినిమా ఇండస్ట్రీతో ఉన్న సంబంధాల గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

మంత్రి కేటీఆర్ కు సినిమా ఇండస్ట్రీతో ఉన్న సంబంధాల గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో కేటీఆర్ ఎవరికి ప్రాధాన్యం ఇస్తారో అందరికి తెలుసునని ఆయన సైటైర్లు వేశారు. శనివారం గాంధీ భవన్ మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సంస్కృతిని మాభూమి సినిమా ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకులు బి.నర్సింగరావుకు మంత్రి కేటీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. తెలంగాణ కవులు, కళాకారులను మంత్రి కేటీఆర్ అవమానిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ అమరవీరుల కుటుంబాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ మోసాలను ప్రజలకు వివరించేందుకు దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 22న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి జాతీయ నేతలు హాజరుకానున్నట్లు చెప్పారు.