చిరంజీవిపై ట్విట్టర్ వేదిక ఆర్జీవి సెటైర్లు..!
దిమ్మతిరిగేలా.. సమయం చూసి చిరు భజన బ్యాచ్ ఇజ్జత్ తీసిన… ఆర్జీవీ..
వాల్తేరు వీరయ్య ఎవరి మూలాన ఆడిందో ప్రూఫ్ చేయడనికు తీసినట్టుంది బిఎస్. అంటూ RGV ట్వీట్ చేశారు..
పొగడ్తలతో ముంచేవాళ్లు బ్యాచి కన్నా ప్రమాదకరమైన వాళ్లు ఉండరు..మారో ట్వీట్..
చిరంజీవిపై ఆర్జీవీ ట్విట్టర్ లో వేసిన కౌంటర్ వైరల్ గా మారింది. తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా రిలీజయి బాగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి స్థాయి, ఏజ్ ఉన్న రజినీకాంత్, కమల్ లాంటి వాళ్ళు విక్రమ్ లాంటి వాళ్ళ ఏజ్ కి తగ్గ సినిమాలు చేస్తుంటే చిరంజీవి మాత్రం ఇంకా హీరోయిన్స్ తో డ్యాన్సులు వేస్తూ, వింటేజ్ అంటూ ఏజ్ ని కవర్ చేస్తూ కామెడీ చేయడానికి చూస్తూ విమర్శల పాలవుతున్నారు…
హైపర్ ఆది, గెటప్ శ్రీను, పలువురు జబర్దస్త్ కమెడియన్లు మెగాస్టార్ ని ఆకాశానికెత్తేశారు. ఆయన గురించి పొగుడుతూ భజన చేశారు. ఆయన స్థాయి ఓ రేంజ్ అని అందరికి తెలిసిందే అయినా వీళ్ళు భజన చేసినట్టే అనిపించింది. ఇక సినిమాలో వీళ్ళందర్నీ పెట్టుకొని చేసిన కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం, ఈ జబర్దస్త్ కామెడీ వర్కౌట్ అవ్వకపోవడంతో విమర్శలు బాగా వస్తున్నాయి…