ఆర్జీవీ తల నరికి తెస్తే కోటి రూపాయలు బహుమతి ఇస్తానని టీవీ షో డిబేట్ లో కొలికపూడి శ్రీనివాసరావు…

తన తలపై కోటి రూపాయల పారితోషికం ప్రకటించినందుకు కొలికపూడి శ్రీనివాసరావుపై సినీ దర్శుకడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు…’X’ పోస్ట్ లో ఆర్జీవీ ఆంధ్రప్రదేశ్ పోలీసులను ట్యాగ్ చేసి, దీనిని తన అధికారిక ఫిర్యాదుగా పరిగణించాలని కోరారు. కొలికపూడి శ్రీనివాస్‌రావుకు ఓ యాంకర్ సహకరించారని, అతనితో కలిసి నాపై హత్యను ప్రయత్నించారని వర్మ ఆరోపించారు. ఇక టీవీ ఛానల్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వర్మ వెల్లడించారు.

కాగా అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకుడు శ్రీనివాసరావు రాబోయే చిత్రం ‘వ్యూహం’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. శ్రీనివాసరావు ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాలతో సమాజాన్ని తప్పుదొవపట్టిస్తున్న ఆర్జీవీ తల నరికి తెస్తే కోటి రూపాయలు బహుమతి ఇస్తానని టీవీ షో డిబేట్ లో కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది….
https://twitter.com/RGVzoomin/status/1739937149586157595?t=IZdfLk9VIiyk_-YnOx8yXQ&s=19
దీంతో వర్మ ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘వ్యూహం’ సందర్భంగా హైదరాబాద్‌లోని తన కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన టీడీపీ, జనసేన నాయకులపై వర్మ విమర్శలు గుప్పించారు. ఇక వివాదాస్పద సినిమాలో చంద్రబాబు ఇమేజ్‌ను చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ‘వ్యూహం’ సినిమాను విడుదలను అడ్డుకునేందుకుటీడీపీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. డిసెంబర్ 29న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీపై ఉత్కంఠత నెలకొంది.