మావోయిస్ట్‌ అగ్రనేత ఆర్కే మృతి…!

Breaking..

నాలుగు దశాబ్దాలకు పైగా ఆర్కే అజ్ఞాత జీవితం..

R9TELUGUNEWS.com.
స్వగ్రామంగుంటూరు జిల్లా తుమ్మూరుకోట..YSR హయాంలో శాంతి చర్చల్లో కీలకంగా వ్యవహరించిన RK..కొంతకాలంగా తీవ్ర ఆలోరోగ్యంతో బాధపడుతున్న ఆర్కే .
మావోయిస్ట్‌ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్.కె మృతి చెందారని సమాచారం. ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆర్కే అనారోగ్యంతో చనిపోయినట్లు తెలుస్తోంది. రామకృష్ణ మృతి చెందిన విషయాన్ని చత్తీస్‌గఢ్‌ పోలీసులు ధృవీకరించారు…

బీజాపూర్‌ అడవుల్లో ఆయన చనిపోయినట్టుగా తెలుస్తోంది.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆర్కే.. ఇవాళ కన్నుమూశారని తెలుస్తోంది.. ఇక, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోలీసులు-మవోయిస్టుల మధ్య జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించారు రామకృష్ణ.. చాలా సమయాల్లో పెద్ద పెద్ద ఎన్‌కౌంటర్ల నుంచి చివరి నిమిషంలో ఆయన తప్పించుకున్నారు. భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రతీ సందర్భాల్లోనూ ఆర్కే చనిపోయారా? లేదా బతికే ఉన్నారా? అనే చర్చ కూడా సాగుతూ వచ్చింది. కానీ, మళ్లీ ఆయన కదలికలపై వార్తలు వచ్చేవి.. అయితే, గత రెండేళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు… ఈ నేపథ్యంలోనే ఆయన మృతిచెంది ఉంటారని సమాచారం.

తీవ్ర అనారోగ్య సమస్యలతో బీజాపూర్‌ అడవుల్లో ఆర్కే మృతిచెందినట్టు బస్తర్‌ పోలీసులు చెబుతున్నారు.. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైనా ఆర్కేపై రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రివార్డు ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై దాడి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు ఆర్కే.. ఎన్‌ఐఏ మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నారు ఆర్కే.. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో కీలక సూత్రధారిగా ఉన్నారు ఆర్కే.. అయితే, దీనిపై తెలంగాణ పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది..