ఆర్.ఎల్.జె.పి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి సంపూర్ణ మద్దతు…

కేంద్రంలోని ఎన్డిఏతో ఆర్.ఎల్.జెపి పొత్తు నేపథ్యంలో ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలుపుకు కృషి చేస్తామని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ(ఆర్.ఎల్.జె.పి) జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి జివి.మణిమారన్ ప్రకటించారు.బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇనుగాల భీమారావుతో కలసి ఆయన మాట్లాడుతూ బీసీల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే బిసి వర్గానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం శుభపరిణామం అన్నారు. వివిధ వెనుకబడిన తరగతులను ఒకే గొడుగు కిందకు చేర్చేందుకు బిజెపి దూకుడుగా ముందుకు సాగుతోందన్నారు. జాతీయ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్జీ ఆదేశాల మేరకు ఆర్ఎల్ జెపి దాని కార్యకర్తలు రాబోయే ఎన్ డిఏ ప్రతి అభ్యర్థి విజయం కోసం పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు పెండ్యాల నర్సింగ్ రావు, సమ్మయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మధుసూధన్ రావు తదితరులు పాల్గొన్నారు.