నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9మంది వ్యవసాయ కూలీలు దుర్మరణం..

https://youtu.be/SrC6dv47sxU
నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందారు…

పిఏ పల్లి మండలం అంగడి పేట గ్రామం వద్ద హైదరాబాద్ to నాగార్జునసాగర్ రహదారిపై భారీ కంటైనర్ ఆటో ను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 9 గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి…మృతులంతా దేవరకొండ మండలం చింత బావి తండా వాసులు.. వీరు పక్కగ్రామమైన పోతులూరు తండా లో వరి నాట్లు వేయడానికి ఉదయాన్నే వెళ్లారు.. పని ముగించుకొని స్వస్థలానికి ఆటోలో తిరిగి వెళ్తుండగా మృత్యుశకాటం లా కంటైనర్ వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొన్నది….మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక ఆటో డ్రైవర్ వున్నారు…
క్షతగాత్రులను ,మృతదేహలను దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు..
దేవరకొండ mla రవీంద్ర కుమార్, sp రంగనాద్ లు దేవరకొండ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్ కు తరలించారు…ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ,జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి
తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు…
గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు…ఇక ఏడుగురు దుర్మరణం చెందడంతో చింత బావి తండాలో విషాధచాయలు అలుముకున్నాయి..ఊరువారంత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..మరొక మూడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే వీరంతా వారి ఇళ్లకు క్షేమంగా చేరుకునేవారు… ఇంతలో రెప్పపాటులో మృత్యుశకాటం లా కంటైనర్ వీరి జీవితాలను తారుమారు చేసింది….కంటైనర్ నడుపుతున్న డ్రైవర్ క్లినర్ ఇద్దరు పుటుగా మద్యం తాగి వాహనం నడుపుతున్నాట్లు గా పోలీసులు నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో వెల్లడైంది….

మృతులు

9 మంది పేర్లు

1..ఆటో డ్రైవర్ మల్లేశం….
2.నోమల పెద్దమ్మ,
3.నోమల సైదమ్మ.
4.కొట్టం పెద్దమ్మ
5.గొడుగు ఇద్దమ్మ.
6.చంద్రమ్మ
7..అంజమ్మ

హైదరాబాద్ లో చికిత్స పొందుతూ

8..లింగమ్మ.
9..అలివేలు..

నల్లగొండ జిల్లా అంగడిపేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాక్సిడెంట్ కు దారితీసిన పరిస్థితులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు….