బ్యాచిలర్ పార్టీకి వెళుతూ ఘోరం.. ముగ్గురు మృతి.. 9 మందికి గాయాలు…

సరదాగా గడిపేందుకు 12 మందితో ఓఫియన్ పార్క్ కు వెళుతన్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి..

మరో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు. కారులో ఇరుకున్న మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లారీని వెనకాల నుండి మితిమీరిన వేగంతో ఢీ కొట్టడంతో కారులో ఇరుక్కుని ఇద్దరు విద్యార్థినీలు, ఓ విద్యార్థి మృతి చెందారు. మృతుల్లో ఓ విద్యార్దిని దివ్యగా గుర్తించారు. శంకర్ పల్లి నుండి హైదరాబాద్ వచ్చే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది..