పాల ట్యాంకర్‌ -కారు ఢీ ముగ్గురు దుర్మరణం..!

*పాల ట్యాంకర్‌ -కారు ఢీ ముగ్గురు దుర్మరణం*
ప్రకాశం జిల్లా:జులై 22
మార్టూరు మండలం కొనంకిలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలిసింది, జాతీయ రహదారి పై పాల ట్యాంకర్‌ను కారు ఢీకొట్టిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
మృతుల వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. నిదానంగా ప్రయాణాలు చేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని చెప్పారు. కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలనిడ్రైవర్లకు పోలీసులు సూచించారు….