రోడ్డు ప్రమాద బాధితుల సమాచారం ఇస్తే పారితోషికం..క్షతగాత్రుల ప్రాణాలు నిలబెట్టేందుకు కేంద్రం చొరవ…

R9TELUGUNEWS.com
రోడ్డు ప్రమాదం జరిగింది అంటే చాలు చూసేవారు ఎక్కువమంది ఉంటారు కానీ సమాచారం ఇచ్చే వారు మాత్రం ఒకరిద్దరే ఉంటారు.. చాలామంది మనకెందుకులే ఈ సమస్య మన నెత్తిన చుట్టుకుంటుంది అనే ఒక అపోహలో కళ్ళముందు అనే వ్యక్తులు చనిపోతున్నా పట్టించుకోకుండా వెళ్తున్నారు… దీనికోసం ప్రత్యేకంగా
మహానగరంలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న వారికి సరైన సమయంలో వైద్యం అందడం లేదు. కొనప్రాణాలతో ఉన్న వారికి

మొదటి గంట(గోల్డెన్‌ అవర్‌)లో వైద్యం అందకపోవడంతో విగతజీవులుగా మారుతున్నారు. దీనికి కారణం రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు తమ కళ్ల ముందు కనిపిస్తున్నా మనకెందుకులే.. అని వారికి వైద్య సాయం అందించడానికి అనేకమంది ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితి అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌ సమారిటన్‌ పేరుతో సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రోడ్డు ప్రమాదంలో గాయపడినవారి సమాచారం వెంటనే పోలీసులకు చెప్పినా, ఆస్పత్రికి తీసుకువెళ్లినా కూడా సంబంధితులకు రూ.5వేల చొప్పున బహుమానం ఇవ్వడమే కాకుండా వారిని సన్మానించాలని నిర్ణయించారు. ఈ కొత్త పథకం రాజధాని పరిధిలో ప్రమాదాల్లో గాయపడినవారిని తక్షణం ఆస్పత్రులకు తీసుకువెళ్లడానికి ఉపయోగపడుతుందని అనేకమంది చెబుతున్నారు.

అందించిన సమాచారం లో ఏది ఉత్తమ మైనది అయితే వారికి రూ.లక్ష.

రోడ్డు ప్రమాద క్షతగాత్రులను చుట్టుపక్కలవారు ఆస్పత్రులకు తరలించడం లేదా పోలీసులకు సమాచారం అందించడం లేదు. దీంతో కొన్నిసార్లు బాధితులను తరలించడానికి కొన్నిసార్లు రెండు గంటల పడుతోంది. అప్పటికే ప్రమాదంలో గాయపడినవ్యక్తి కోమాలోకి వెళ్లిపోతున్నారు. సమాచారం ఇచ్చిన, ఆస్పత్రికి తరలించిన వారికి పోలీసు విచారణ పేరుతో తర్వాత ఎటువంటి వేధింపులు ఉండవని ప్రభుత్వం చెబుతున్నా చాలా మందిలో మార్పు రావడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో పోలీసులవైఖరి మారడంతో గత కొంతకాలంగా కొందరిలో మార్పు కన్పిస్తోంది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు గానీ 108కు గానీ ఫోన్‌ చేయడం కొంతవరకు మంచి పరిణామమని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ సరికొత్త పథకాన్ని అమలులోకి తెచ్చింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేసినా, క్షతగాత్రుడిని వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించినా గానీ సంబంధితులకు రూ.5వేలు పారితోషికం కింద ఇవ్వాలని నిర్ణయించింది. ఉత్తమ ప్రాణదాతలుగా నిల్చిన పదిమందికి రూ.లక్ష చొప్పున బహుమానం ఇవ్వాలని నిర్ణయించింది. ఇలా సమాచారం ఇచ్చిన వారికి ఇక నుంచి ఎటువంటి పోలీసు వేధింపులు ఉండవు. సంబంధితులు ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే కేసు నమోదు సమయంలోనే ప్రస్తావిస్తారు తప్ప వారిని ఠాణాకు పిలవకుండా చర్యలు తీసుకోబోతున్నారు. వీటన్నింటి వల్ల క్షత్రగాత్రులకు భరోసా లభిస్తుందని పోలీసులు చెబుతున్నారు. కేంద్రం ప్రకటించిన కొత్త పథకంపై పెద్దఎత్తున ప్రచారం చేస్తామని హైదరాబాద్‌ కమిషనరేట్‌లో సీనియర్‌ అధికారి చెప్పారు. తమకు సమాచారం ఇచ్చినవారికి నగదు ఇవ్వడంతోపాటు సర్టిఫికెట్‌ కూడా ప్రదానం చేస్తామన్నారు.

R9TELUGUNEWS.com