విజయవాడ – హైదరాబాద్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం.. అటుగా వెళుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ స్పందించి వెంటనే సహాయక చర్యలు అందించారు…
సూర్యపేట జిల్లా..
.
*విజయవాడ – హైదరాబాద్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం*
*హైదరాబాద్ వైపు వస్తున్న టూవీలర్ ని వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టిన కారు*
*అక్కడికక్కడే
ముగ్గురు మృతి ..
……
ఇద్దరికి తీవ్ర గాయాలు*
*అంబులెన్స్ కి కాల్ చేసి, క్షతగాత్రులను హాస్పిటల్ కి పంపించి, అక్కడే ఉండి సేవలు అందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు *
*హైదరాబాద్ – విజయవాడ హై వే లో కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన స్థలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గర ఉండి సేవలు అందించారు*
పాలకుర్తి నియోజకవర్గ పర్యటన ముగించుకొని మేళ్ళచెరువు వెళుతున్న మంత్రి ..కళ్ళ ముందే ఓ వాహనం అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో
భార్యభర్త కూతురు మృతి,(ముగ్గురు మృతి..).
మరో ఇద్దరు చిన్న పిల్లలకు తీవ్ర గాయాలు.
హైదరాబాద్ వైపు వస్తున్న ఒక టూ వీలర్ ని వెనుక నుండి వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టిన ఘటన జరిగింది..బోయాల శ్రీనివాస్(32), భార్య నాగమణి(28) పాపా(8) మృతి, మృతులు కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామనికి చెందిన వారుగా గుర్తింపు..నల్లబండగూడెం నుండి శ్రీను అత్తవారింటికి చిలుకూరు మండలం సీతారామపురం గ్రామానికి బైక్ పై భార్య ముగ్గురు కుతుళ్ళతో వెళ్తుండగా కోదాడ టౌన్ గుడిబండ ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం.బైకు పై వెళ్తున్న కుటుంబ సభ్యులను వెనుక నుండి అతివేగంతో ఢీకొట్టడంతో.. ఫ్లైఓవర్ మీదనుండి కింద పడిపోయిన శ్రీనివాస్ భార్య ముగ్గురు కూతుళ్లు…
వెంటనే స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు 108 నెంబర్ కి ఫోన్ చేయించారు.
స్థానిక ప్రజలతో కలిసి దగ్గరుండి క్షతగాత్రులను సమీప వైద్యశాలకు పంపించారు.
జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు…
అక్కడకు చేరుకున్న పోలీసులతో కలిసి అక్కడే ఉండి ట్రాఫిక్ ని క్లియర్ చేయించారు.
జరిగిన విషాద ఘటన పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు.
వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు….
ఈ ఘటన లో గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించగా.. మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు…