రోడ్డు ప్రమాదంలో మరో సీనియర్ జర్నలిస్టు తీవ్ర గాయాలు…

రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్టు స్వామికి తీవ్ర గాయాలు…

*_పరిస్థితి విషమం…_*

ఇటీవల ఎన్ టివి రిపోర్టర్ వార్త సేకరణకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ప్రస్తుతం మరో జర్నలిస్ట్ కి వార్త సేకరణకు వెళ్లి తిరిగి వస్తుండగా తీవ్ర గాయాలు పాలయ్యారు.. ఆలమూరు మండల సీనియర్ జర్నలిస్ట్ కోలాటి భైరవస్వామి (స్వామి) రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలు అవగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. నర్సిపూడి గ్రామంలో వార్త కవరేజ్ కు వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తుండగా మోదుకూరు – గుమ్మలేరు మార్గంలో స్వామి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనానికి ప్రమాదం జరగడంతో తలకు తీవ్రమైన గాయం అవగా… స్వామితో ఉన్న స్థానిక విలేకరులు మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కొరకు అక్కడ నుండి రాజమహేంద్రవరం తరలించి మరింత మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఆలమూరు మండల ప్రెస్ క్లబ్ సభ్యులు హుటాహుటిన కాకినాడ చేరుకుని స్వామి ఆరోగ్య పరిస్థితులపై వైద్యుల నుండి అడిగి తెలుసుకున్నారు. కాగా స్వామికి జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలు అవటంతో ఖరీదైన వైద్యం జరగాలని వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం స్వామి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు…