శ్రీశైలం ఘాట్ లో రెండు కార్లు ఢీ…

శ్రీశైలం ఘాట్ లో రెండు కార్లు ఢీ….

దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతల సమీపంలోని ఘాట్ రోడ్డులో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో కార్లలో ఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. దోర్నాల – శ్రీశైలం రహదారిలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న దోర్నాల పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను పునరుద్దరించారు. గాయపడిన వారిని దోర్నాల మండల అధ్యక్షురాలు భర్త గుమ్మా యల్లేష్ తన వాహనంలో చింతలలోని ఆసుపత్రికి తరలించారు.