ఆగివున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బ‌స్సు – డ్రైవ‌ర్ మృతి…

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాస్‌నగర్‌ వద్ద ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి చెందగా.. 12 మందికి గాయాలయ్యాయి..క్షతగాత్రులను మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించిన ఇద్దరిని ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు కాకినాడ నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది…..