అరకు ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం….

అరకు ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి డముక వద్ద శుక్రవారం రాత్రి ఓ టూరిస్ట్‌ బస్సు లోయలో పడింది. దీంతో 8 మంది మృతి చెందగా 10 మందికిపైగా గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద్‌ షేక్‌పేట్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సంఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 24 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పోలీసు బృందాలు, 108 సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి..స్థానిక అధికారులు వారందరినీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు. బాధితులంతా హైదరాబాద్ నగరవాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నట్టు గుర్తించారు… ప్రమాదానికి గురైన బస్సును హైదరాబాద్‌ షేక్‌పేటకు చెందిన దినేశ్‌ ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా భావిస్తున్నారు. పూర్తిగా చీకటి పడటంతో సహాయకచర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. బాధితులంతా ఇవాళ ఉదయం హైదరాబాద్‌ నుంచి అరకు వచ్చి.. అరకు నుంచి తిరిగి వెళ్తుండగా లోయలోకి బస్సు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాద వివరాల కోసం అధికారులు కంట్రోల్‌ రూంని ఏర్పాటు చేశారు. వివరాలకు 08912590102, 08912590100 నంబర్లను సంప్రదించాలని తెలిపారు…