రోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట బైక్ నడుపుతూ ముద్దులు, రొమాన్స్..

సోషల్ మీడియా వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయినప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ గా ఉండే వీడియోలు అన్ని ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి..కొన్ని వీడియోలు అయితే పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇటీవలే రొమాన్స్, జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటున్నాయి. అంతేకాకుండా గతంలో జరిగిన కొన్ని వింత సంఘటనలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో లవ్ బడ్స్‌ హద్దులు మీరి ప్రవర్తిస్తున్న కొన్ని సంఘటనలు ఎప్పుడు వైరల్ అవుతూ వస్తున్నాయి.

ఇటీవలే ఢిల్లీ మెట్రో, లోకల్ ట్రైన్లలో ప్రేమ జంటలు చేసే కొన్ని వికృతి చేష్టలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలే ఓ ప్రేమ జంట రద్దీ ప్రదేశంలో నడిరోడ్డుపై బైక్ లో వెళ్తుంటే చేసిన వింత చేష్టలు సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ఇంతకీ వారు ఇంటర్నెట్లో వైరల్ అవ్వడానికి కారణాలేంటో? వారు నడిరోడ్డుపై ఏం చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వీడియో వివరాల్లోకి వెళితే.. రోడ్డుపై బైక్ పై వెళ్తున్న ఓ ప్రేమ జంట నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే తన ప్రియురాలికి లిఫ్ట్ లిఫ్ట్ కిస్ ఇచ్చాడు. దీనిని చూసిన తోటి ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. అతివేగంగా రద్దీగల ప్రదేశంలో చిన్న బైక్ పై వెళుతున్న ఇద్దరు ప్రేమికులు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేశారు. ఓ యువకుడు బైకును ఎంతో వేగంగా తోలుతూ వెనకాలోనే కూర్చున్న తన లవర్ కి వెనుకకు తిరిగి మరి పెదవిపై ముద్దు పెట్టాడు..అంతేకాకుండా ఆ యువకుడు వెనక్కి తిరిగి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. అయితే దీనిని చూసినా ఓ తోటి ప్రయాణికుడు వారి వాహనం వెంటే వెళ్తూ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడం ప్రారంభించింది. అయితే ఈ వీడియోను చూసిన కొంత మంది తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా ఈ వీడియోను సుమోటోగా తీసుకొని పోలీసులు వారిద్దరిపై కేసు కూడా బుక్ చేసినట్లు సమాచారం.

ఈ వీడియోను చూసిన అధికారులు ఇలాంటి ఘటనలకు మళ్లీ పాల్పడితే ప్రభుత్వపరంగా కఠినమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను రజని సింగ్ అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. పోలీసులను ట్యాగ్ చేసి పోస్టు చేయడంతో ఈ వీడియో అధికారుల వరకు చేరుకోగలిగింది. ఈ ఘటన సెప్టెంబర్ 15వ తేదీ 2023 సంవత్సరంలో జరగగా..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.