అగ్రరాజ్యం అమెరికా తదుపరి అధ్యక్షుడిగా భారతీయ మూలాలున్న రోహిత్‌ ఖన్నా.!!!

అగ్రరాజ్యం అమెరికా తదుపరి అధ్యక్షుడిగా భారతీయ మూలాలున్న సంతతి Rohit Khanna… అగ్రరాజ్యంలో కూడా భారత్ సంతతికి అరుదైన గౌవరవం దక్కనున్నది…  Rohit Khanna..September 13, 1976 (age 45)
వ్యక్తిని చూసే సమయం ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ కొనసాగుతుండటం తెలిసిందే. 2024లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండో-అమెరికన్‌ కాంగ్రెస్‌మెన్‌ రో ఖన్నా (రోహిత్‌ ఖన్నా) పోటీచేయాల్సిందిగా బెర్నీ సాండర్స్‌ ప్రెసిడెన్షియల్‌ క్యాంపెయిన్‌ కీలక సభ్యులు, డెమోక్రటిక్‌ పార్టీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ మేరకు అమెరికాకు చెందిన వార్తా వెబ్‌సైట్‌ ‘పొలిటికో’ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు 79 ఏండ్లు. వచ్చే దఫా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీచేయడానికి ఆయన ఆరోగ్యం సహకరించకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.