మంత్రి హోదాలో తొలి సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి రోజా…. ఈ సమావేశంలోనే సెల్ఫోన్ చోరీ.!!

తిరుపతిలోని ఎస్వీయూ ఆవరణలో ఆలయానికి వెళ్లారు రోజా. ఇదే సమయంలో మంత్రి ఫోన్‌ కొట్టేశాడు ఓ దొంగ. శాప్ సమావేశంలో ఉన్న సమయంలో సెల్ ఫోన్ల గురించి రోజా వివరిస్తున్న సమయంలో ఫోన్ చోరీ అయినట్లుగా తెలుస్తోంది.మంత్రి రోజా తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు.. కాగా మంత్రి రోజా సెల్‌ఫోన్‌ చోరీ చేసిన వ్యక్తి ఎవరన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు.. వెంటనే ట్రాకింగ్ ద్వారా ఫోన్‌ దొంగలించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ..శాప్ సమీక్ష సమావేశంలో మంత్రి రోజా మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్‌ను ముందుకు తీసుకువెళ్లాలనేది సీఎం జగన్ ఆలోచనగా ఉందని తెలిపారు. ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి రోజా తెలిపారు. క్రీడల్లో సరైన ప్రోత్సాహం లేకపోవడంతో యువతీ యువకులు వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రతి నియోజకవర్గంలో స్పోర్ట్స్ క్లబ్ అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు…సెల్ ఫోన్స్ వల్ల చాలామంది స్పోర్ట్స్‌కు దూరం అవుతున్నారన్నారు. పిల్లలు చిన్న విషయాలకు డిప్రెషన్ అవుతున్నారని.. వాళ్లు చాలా సెన్సిటివ్‌గా మారుతున్నారని తెలిపారు. స్పోర్ట్స్ ఆడటం వల్ల మానసిక స్థైర్యం వస్తుందని మంత్రి రోజా అన్నారు. ఫైర్ అనేది ఇన్ బిల్ట్ అని.. చెడు మీద ఫైర్ అలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. తానెప్పుడూ సీఎం జగన్‌ను ఫాలో అవుతానని స్పష్టం చేశారు. మనం చేసే అభివృద్ధి పనులే మనల్ని విమర్శించే వాళ్లకు సమాధానం చెప్తాయని రోజా వ్యాఖ్యానించారు. అంతకుముందు తిరుపతి ఎస్వీయూ ఆవరణలోని వెంకటేశ్వరస్వామిని మంత్రి రోజా దర్శించుకున్నారు.