కుక్కకు బిస్కెట్లు వేసినట్టు 24 సీట్లు ఇస్తే..తోక ఊపుకుంటూ పవన్ ఎందుకు వెళ్లారు…మంత్రి రోజా..

కుక్క కు బిస్కెట్లు వేసినట్టు 24 సీట్లు ఇస్తే..
తోక ఊపుకుంటూ పవన్ ఎందుకు వెళ్లారు.. మంత్రి రోజా..ముఖ్యంగా టీడీపీ-జనసేన పొత్తుపై స్పందించారు. ఏ ఫ్యాకేజీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 24 సీట్లకు తలవంచారు అని ప్రశ్నించారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో చంద్రబాబు ఇంకా డిసైడ్ చేయలేదు. ఒక చోట ఓడిన వారికి తొలి జాబితాలో.. రెండు చోట్ల ఓడిన వారికి మళ్లీ ఇస్తారేమోనని సెటైర్లు వేశారు రోజా…
కాపుల ఆత్మగౌరవాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సీఎం అంటూ జనాలు పిచ్చి వ్యాఖ్యలు చేస్తారంటూ రోజా పేర్కొనడం గమనార్హం. సొంత జెండా సొంత అజెండాతో ప్రజలకు మంచి చేస్తూ.. నేను వైయస్ కాంగ్రెస్ నాయకున్ని అని గర్వంగా చెప్పుకునే విధంగా సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తారని తెలిపారు. టిడిపి, జనసేన డ్రామాలు ఆడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. చంద్రబాబు అయితే బీజేపీ, లేకపోతే కాంగ్రెస్.. ఎవ్వరితో అంటే వాళ్లకు జై కొడతారని పేర్కొన్నారు. పవన్, చంద్రబాబు పై నిప్పులు చెరిగారు రోజా..