చంద్రబాబు పై మండిపడిన రోజా….

చంద్రబాబు పై మండిపడిన రోజా..

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే పంచాయతీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలకు నిదర్శనంగా నిలుస్తోందని నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా పేర్కొన్నారు. ఇక చంద్రబాబు పార్టీ వ్యవహారాల ను తప్పుకొని తన శేష జీవితాన్ని మనవడితో గడిపేందుకు కేటాయించాలని ఆమె ఎద్దేవా చేశారు.. నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశమైన నగరి ఎమ్మెల్యే రోజా. కుప్పం పంచాయతీ ఎన్నికలపై ఫలితాలపై స్పందిస్తూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పై ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవహారాల పక్కన పెడితే మంచిదని,ఆయన శేష జీవితాన్ని మనవడితో గడిపేందుకు కేటాయించాలని ఎద్దేవా చేశారు. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నీ అక్కడి ప్రజలు ఎలా బొందపెట్టేరో చూస్తూనే ఉన్నారు..
ఓ సారి చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని, అందుకు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లో ఎలాంటి అనూహ్యమైన ఫలితాలకు దారితీసిందో చంద్రబాబు గుర్తించాలని, ఇకనైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆమె హితవు పలికారు..