సీఎం కేసీఆర్ కారణజన్ముడు : – సినీ నటి,ఎమ్మెల్యే రోజా.

సీఎం కేసీఆర్ కారణజన్ముడు : – సినీ నటి,ఎమ్మెల్యే రోజా.

తెలంగాణ రాజకీయాలను మాత్రమే కాకుండా భారత రాజకీయాలను మలుపు తిప్పగల రాజకీయ చతురుడు.

తన చిన్ననాటి రాజకీయ గురువు మదన్ మోహన్ చదువు పూర్తి కాగానే ఉద్యోగం చేయమని అడిగితే, తాను రాజకీయాల్లోకి వస్తానని నిర్మోహమాటంగా చెప్పిన నిక్కచ్చి మనిషి. కె.సి.ఆర్. అప్పుడే రాజకీయాల్లోకి రాకుండా ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమయి ఉండేదా అనేది ప్రశ్న మాత్రమే కాదు పచ్చి నిజం.తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే, బంగారు తెలంగాణ స్థాపన కోసమే రాఘవ రామ, వెంకటమ్మ దంపతులకు ముద్దు బిడ్డగా జన్మించిన కారణజన్ముడు కె.సి.ఆర్. తాను పుట్టిన నేల మీద అచంచలమైన ప్రేమతో తెలంగాణను సాధించి పెట్టిన పోరాట యోధుడు….

ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్బుతంగా నిర్మాణం చేస్తున్నారు. గతంతో పోలుస్తే చక్కగా ఇప్పుడు ఆలయాన్ని డిజైన్ చేసి పునః నిర్మాణం చేశారు.. ఈ కాలంలో ఏవరికి దక్కని అవకాశం కేసీఆర్ కు దక్కింది.. భగవంతుడే కేసీఆర్ ద్వారా తనకు కావాల్సిన ఆలయాన్ని నిర్మించుకున్నారు. గుడి కట్టాలంటే భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. కాబట్టే సీఎం అందరి సహకారంతో, దేవుడి ఆశీస్సులతో ఆలయాన్ని నిర్మించారు..రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయం నిర్మాణం అయింది. ఎందుకంటే ఇక్కడి తీసుకువచ్చిన రాయి గుంటూరు నుంచి తీసుకువచ్చారు. ఎప్పటికి తెలుగువారు అన్నదముళ్ళు, అక్కచెల్లెలుగా కలిసి ఉంటారు. తండ్రి సమానులైనా కేసీఆర్ సంతోషంగా ఉంటూ, ప్రజలను సంతోషంగా ఉంచేలా చూడాలని శ్రీవారిని కోరుకున్నట్లు వెల్లఢించారు….