ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో ఐదారు ఎక్స్‌ట్రాలు నమోదైతేనే ఎక్కువ అనుకుంటాం. అదే మహిళల మ్యాచ్‌లో అయితే ఎక్కువలో ఎక్కువ 10, 20 అదనపు పరుగులు నమోదవుతాయి. కానీ ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 115 ఎక్స్‌ట్రాలు నమోదవుతాయని ఊహించగలరా.. నిజమండి బాబు నమ్మడం లేదా అయితే మీరే ఒకసారి చూడండి..
రొమేనియా, లగ్జంబర్గ్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇరు జట్లు కలిసి 115 ఎక్స్‌ట్రాలు సమర్పించుకున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన రొమానియా నిర్ణీత 18 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. రెబెక్క బ్లాక్ (73 నాటౌట్) హాప్ సెంచరీతో చెలరేగగా.. ఎక్స్‌ట్రాల రూపంలో 43 పరుగులు వచ్చాయి. ఇందులో 32 వైడ్లు ఉండటం విశేషం. అనంతరం ఛేదనలో లగ్జంబర్గ్ 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి విజయం సాధించింది. క్రీజులోకి దిగిన నలుగురు ప్లేయర్లు లాలొర్ (6), జార్జియా (17), కెర్రీ (25 నాటౌట్), ఆర్తి ప్రియ (14 నాటౌట్) ఓ మోస్తరు స్కోరు చేయగా.. ప్రత్యర్థి జట్టు ఎక్స్‌ట్రాల రూపంలో ఏకంగా 72 పరుగులు సమర్పించుకుంది. మొదట బౌలింగ్ చేసిన జట్టు 43 అదనపు పరుగులు ఇస్తే.. ఆ తర్వాత మేమేం తక్కువా అన్నట్లు వీళ్లు 72 ఎక్స్‌ట్రాలు ఇచ్చుకున్నారు..