RRR సినిమా థియేటర్స్ బాక్సులు బద్దలు కొట్టినట్లే…!!RRR కథ ఏమిటంటే?..!

ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈరోజు గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అర్ధరాత్రే నుంచే బెన్‌ఫిట్ షోలు మొదలయ్యాయి….బొమ్మ దద్దరిల్లిందనే టాక్ సోషల్ మీడియాలో హోరెత్తుతున్నది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన టాక్ గురించిఒక లుక్ వెయ్యండి.

. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ టిక్కెట్ల కోసం తెలుగు సినీ ప్రియులతో పాటు యావత్‌ సినీ ప్రపంచం థియేటర్స్ వద్ద బారులు తీరారు. కొన్ని థియేటర్స్ వద్ద ఫాన్స్ హంగామా చేస్తున్నారు.
భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో.. మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ చేసింది. ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో.. సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమతమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. కొందరు సినిమా బాగుందని పోస్ట్ చేస్తే.. మరికొందరు పర్లేదు అని ట్వీట్లు చేస్తున్నారు…

NTR ఫ్యామిలీ స్పెషల్ షో..

ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వీఐపీ స్క్రీన్‌లో సినిమాను గురువారం రాత్రి 9 గంటల నుంచి చూడటం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సినిమాను వీక్షించేందుకు వచ్చారు. ఎన్టీఆర్ వెంట కల్యాణ్ రామ్, తదితరులు సినిమాను వీక్షించారు.

చిరంజీవి ఫ్యామిలీ, నాగవంశీ
ఇదిలా ఉండగా.. గురువారం అర్ధరాత్రి నుంచి ఏఎంబీలోని నాలుగు స్క్రీన్లలో సెలెబ్రిటీల షోలు రన్ అయ్యాయి. చిరంజీవి ఫ్యామిలీ, నాగవంశీ తదితరులు ప్రైవేట్ స్క్రీనింగ్‌కు ఏర్పాట్లు చేసుకొన్నారు. దీంతో ఏఎంబీ వద్ద అభిమానులు, ప్రేక్షకులతో హంగామా నెలకొన్నది…

నటన విషయానికి వస్తే..

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ యాక్టింగ్‌ ఇరగదీశారని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ అయితే అదిరిపోయిందట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ఒక విజువల్ వండర్.. ఒక ఎమోషనల్ క్లాసిక్.. ఒక యాక్షన్ ఫీస్ట్. చివరగా అబ్బుర పరుస్తోంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘థియేటర్స్ బాక్సులు బద్దలు కాకుంటే ఒట్టు.. ఊహించని మలుపులు ఉన్నాయి. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ యాక్టింగ్‌ సూపర్’..

RRR కథ ఏమిటంటే?..

భారత్‌లో బ్రిటీష్ పాలన కొనసాగుతున్న కాలంలో రామరాజు (రాంచరణ్) పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. స్వాతంత్ర్యం కోసం, ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకొనేందుకు బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న భీమ్ ఓ కారణంగా (ఎన్టీఆర్) ఢిల్లీలోని బ్రిటన్ సర్కార్‌పై విధ్వంసం సృష్టిస్తాడు. బ్రిటీష్ పాలనకు ఎదురు తిరిగిన భీమ్‌ను పట్టుకొనేందుకు రామరాజును ప్రత్యేక అధికారిగా నియమిస్తారు…

ఫస్టాఫ్ ఎలా ఉందంటే?
గిరిజన బాలికను బ్రిటీష్ సేనలు ఎత్తుకెళ్లే ఓ ఎమోషనల్ సీన్‌తో కథ మొదలవుతుంది. బ్రిటీష్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే పోలీస్ అధికారి రాంచరణ్ హై ఓల్టేజ్ యాక్షన్ సీన్‌తో కథ మరింత ఎమోషనల్‌గా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాద్ అడవుల్లో ఎన్టీఆర్ యాక్షన్ ఎపిసోడ్‌తో కథ మరింత స్ట్రాంగ్‌గా మారుతుంది. నాటు నాటు పాట, ఇద్దరు హీరోల ఎంట్రీ, అలాగే రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య ఫైట్‌తో తొలిభాగం ఎమోషనల్‌గా ముగుస్తుంది. ఫస్టాఫ్ నిడివి ఎక్కువ కావడం, కొంత స్లోగా కథ సాగడం మైనస్‌గా అనిపిస్తుంది. కానీ రాజమౌళి ట్రీట్‌మెంట్ ఆ రెండు లోపాలను కప్పిపుచ్చేలా ఉంటాయి.

rrr లో ఆ ఒక్క సీన్ చాలు.. ఫ్యాన్స్ ఇద్దరు భుజాన చేయి వేసుకొని వెళ్ళడానికి…rrr లో ఆ ఒక్క సీన్ చాలు.. ఫ్యాన్స్ ఇద్దరు భుజాన చేయి వేసుకొని వెళ్ళడానికి…
సెకండాఫ్‌ మరింత ఎమోషనల్‌గా
సెకండాఫ్‌ మరింత ఎమోషనల్‌గా
ఇక సెకండాఫ్‌లో అజయ్ దేవగన్, శ్రీయ ఎంట్రీలతో కథ మరో లెవెల్‌కు వెళ్తుంది. ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ తర్వాత సీత (ఆలియాభట్) పాత్ర కీలకంగా మారడం కథ మరింత భావోద్వేగంగా మారుతుంది. బ్రీటిష్ కస్టడీలో నుంచి పారిపోయిన భీమ్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే కారణంతో జైల్లో ఉన్న రాంచరణ్ ఓ పాయింట్‌లో ఏకం అవుతారు. బ్రీటీషర్ల కస్టడీలో జైలు నుంచి పారిపోయిన భీమ్ కోసం వెతుకులాట మొదలవుతుంది. సెకండాఫ్‌లో సీత (ఆలియాభట్) పాత్ర ఎంట్రీ ఇస్తుంది. సీత చెప్పిన ఓ వాస్తవం ఆధారంగా రామ్, భీమ్ ఇద్దరు ఏకం అవుతారు. ఆతర్వాత 30 నిమిషాలు చాలా స్లోగా సాగుతుంది. భీమ్‌కు సహకరించారనే కారణంతో చరణ్‌ను బ్రిటీషర్లు జైలులో బంధిస్తారు. ఆ తర్వాత చరణ్ జైలు నుంచి తప్పించుకొనే సీన్‌తో సినిమాలో జోష్ మొదలవుతుంది…