RRR చిత్రం మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 200 నుంచి రూ. 250 కోట్లు వసూలు…!!

దాదాపు 500 కోట్లతో ఈ సినిమా తెరకెక్కింది అని చెప్పుకుంటున్నారు.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ ఆయన ఈ చిత్రం RRR.. బాహుబలి తర్వాత మరోసారి ఆర్ఆర్ఆర్ మూవీతో భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. ఇక ఈ సినిమాను మేకర్స్.. ఐమాక్స్, 3D, డాల్బీ ఫార్మాట్‌లో రిలీజ్ చేసారు. ఇక డాల్బీ విడుదల కాబోతున్న మొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎక్కింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ లతో రాజమౌళి తీసిన భారీ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం రూ.500కోట్ల భారీ బడ్జెట్ పెట్టగా.. ప్రీరిలీజ్ బిజినెసే దాదాపు రూ.200 కోట్లు దాటింది. అయితే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాను బయ్యర్లు బాహుబలి2 కన్నా ఎక్కువ రేట్లు చెల్లించి మరీ దక్కించుకున్నారు. మరి బయ్యర్లకు ఈ సినిమా ఎంత తెచ్చిపెడుతుందనే విషయం కొన్ని రోజులు ఆగితే కానీ అర్థం కాదు.
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ (రణం రౌద్రం రుధిరం) చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ చిత్రం శుక్రవారం (మార్చి 25) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో గురువారం రాత్రి నుంచే ఓవర్సీస్ లో షోలు ప్రదర్శించారు…..మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 200 నుంచి రూ. 250 కోట్లు వసూలు చేస్తుందట. ఓపెనింగ్ డే బాక్సాఫీస్ కలెక్షన్లు ఎక్కువగా తెలంగాణ, ఏపీ నుంచి వస్తాయని అంచనా వేశారు. తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలు పెరగడం, దాదాపు 95 శాతం థియేటర్లలో సినిమా ప్రదర్శించడం, స్టార్ తారాగణం నేపథ్యంలో 100 నుంచి 110 కోట్లు కలెక్షన్స్ వస్తాయని రమేష్ బాలా అంచనా వేశారు. ఇక ఓవర్సీస్‌లో యుఎస్ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. ఇతర దేశాల కలెక్షన్లను కూడా కలుపుకుంటే.. ఓవర్సీస్‌లో 10 మిలియన్ల కలెక్షన్లను నమోదు చేయడం ఖాయం అని అంచనా వేశారు.