RRR సినిమా మార్చి 25 వ తేదీన భారీ స్థాయిలో విడుదల..

మార్చి 25 వ తారీకు “RRR” విడుదల కానున్న తరుణంలో .. సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చకచకా జరిగిపోతున్నాయి. గతంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రీ రిలీజ్ వేడుక.. అంగరంగ వైభవంగా జరిపారు. సౌత్ కి వచ్చేసరికి మలయాళం అదేవిధంగా తమిళ్ లో ఘనంగా నిర్వహించారు. అయితే అసలైన భాష తెలుగుకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక మరింత గ్రాండ్ గా చేయాలని… ఈ ఫంక్షన్కి మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ నీ ముఖ్య అతిథులుగా తీసుకురావడానికి… సినిమా యూనిట్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
. అయితే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ షో లో బెనిఫిట్ షోలు ఫ్యాన్స్ లు ఏమైనా ఉంటాయా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఒకరోజు ముందు ప్రీమియర్ షోలు ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. అయితే మార్చి 25వ తేదీన తెల్లవారుజామున స్పెషల్ షోలు ఉంటాయి…రాజమౌళి బాహుబలి సినిమా అనంతరం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటించారు. మెగా నందమూరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై కేవలం వారి అభిమానులే కాకుండా మిగతా ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తప్పకుండా సినిమా అంతకుమించి అనేలా ఉంటుంది అని చెప్పవచ్చు. మొదటి రోజే 100కోట్ల కలెక్షన్స్ అందుకుంటుందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా అత్యదిక థియేటర్స్ లో విడుదలవుతున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం.