RRR సినిమా చూస్తూ గుండెపోటుతో ఓ అభిమాని మృతి..

అనంతపురంలో విషాదం నెలకొంది. SV మ్యాక్స్ థియేటర్లో RRR సినిమా చూస్తూ గుండెపోటుతో ఓ అభిమాని చనిపోయాడు. సినిమా చూస్తూ.. అభిమాన హీరోల వీడియోలను చిత్రీకరిస్తూ అతడు కుప్పకూలినట్లు స్నేహితులు చెప్పారు.
చికిత్స నిమిత్తం అతడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు… ఈ మూవీ బెనిఫిట్ షో చూస్తూ ఉండగా ఓబులేసు అనే అభిమాని గుండెపోటు చనిపోవడంతో అనంతపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..