ఈ నెల 25న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో నటులుగా చరణ్, ఎన్టీఆర్ మరో మెట్టు ఎక్కారని… రాజమౌళి మరోసారి తన దర్శకత్వ ప్రతిభ ఏంటో చూపించాడని కొనియాడుతున్నారు. కలెక్షన్ల పరంగా విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ.615 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చెబుతున్నారు. హిందీలో ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్‌ని దాటేసినట్లు తెలుస్తోంది…
అయితే తెలంగాణ రాష్ట్రం లోని ఓల్డ్ సిటీ లో పరిస్థితి మరోలా ఉంది…
ఓవైపు హైదరాబాద్‌లోని థియేటర్లలో టికెట్లు దొరక్క ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటే.. మరోవైపు అదే హైదరాబాద్‌లోని పాతబస్తీ థియేటర్లో ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రేక్షకులు కరువవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికీ అక్కడ ఆర్ఆర్ఆర్కి ప్రేక్షకుల నుంచి స్పందన ఓ మోస్తరుగా మాత్రమే ఉందట. ఓవైపు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా పాతబస్తీలో ఈ పరిస్థితిని ఎదుర్కోవడం విచిత్రంగా అనిపిస్తోంది.